ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రముఖ కవి సింగమనేని నారాయణ మృతి - సింగమనేని నారాయణ తాజా వార్తలు

అనంతపురం జిల్లా బండమీదపల్లికి చెందిన ప్రముఖ కవి, రచయిత, సాహితీవేత్త సింగమనేని నారాయణ అనారోగ్యంతో మృతిచెందారు. ఆయన పార్థీవదేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.

Singamaneni Narayana, a famous poet from Bandameedapally, Anantapur district, died due to illness
అనారోగ్యంతో ప్రముఖ కవి సింగమనేని నారాయణ మృతి

By

Published : Feb 25, 2021, 4:18 PM IST

అనంతపురం జిల్లా బండమీదపల్లికి చెందిన సింగమనేని నారాయణ మృతిచెందారు. నారాయణ ప్రముఖ కవి, రచయిత, సాహితీవేత్తగా గుర్తింపు పొందారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న నారాయణ.. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మధ్యాహ్నం తుదిశ్వాసను విడిచారు. ఆయన పార్థీవదేహానికి పలువురు ప్రముఖులు, రచయితలు నివాళులర్పించారు.

సింగమనేని నారాయణ ఇప్పటి వరకు 43కు పైగా కథలు రాశారు. 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కళారత్న పురస్కారాన్ని అందుకున్నారు. రేపు ఉదయం శ్రీనివాస్​నగర్​లో అంతిమయాత్రకు ఏర్పాట్లు చేయనున్నట్లు బంధువులు తెలిపారు.

ఇదీ చదవండి:

ప్రేమించిన వ్యక్తిని కుటుంబసభ్యులు నిరాకరించారని యువతి ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details