అనంతపురం జిల్లా మడకశిర మండలం తిరుమల దేవరపల్లి గ్రామ సమీపంలోని పూల మల్లయ్య కొండలో ఉన్న రంగనాథ స్వామి దేవాలయం వద్ద గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న ఏడుగురిని మడకశిర పోలీసులు అరెస్టు చేశారు. వారిపై కేసు నమోదు చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని సీఐ రాజేంద్రప్రసాద్ తెలిపారు.
గుప్త నిధుల కోసం తవ్వకాలు.. ఏడుగురు అరెస్టు - గుప్త నిధుల కోసం తవ్వకాలు
అనంతపురం జిల్లా మడకశిర మండలంలోని పూల మల్లయ్య కొండలోని శ్రీ రంగనాథ స్వామి దేవాలయం వద్ద గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న ఏడుగురిని మడకశిర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు, శాసన ప్రతులను స్వాధీనం చేసుకున్నారు.
'ఇతర మండలాలకు చెందిన నరసింహులు, గొల్ల హరికుమార్, ఆంజనేయులు, ముత్యాలుతోపాటు మడకశిర మండలానికి చెందిన వడ్డే గంగరాజు, ఆంజనేయులు, హనుమంతు గుప్త నిధుల కోసం శ్రీ రంగనాథ స్వామి గుడి ధ్వజస్తంభం వద్ద తవ్వకాలు జరుపుతున్నట్లు సమాచారం అందింది. వెంటనే ఎస్సై శేషగిరి.. సిబ్బందితో కలిసి దాడులు చేశారు. ఈ దాడిలో ఏడుగురిని అధుపులోకి తీసుకున్నారు. గడ్డపారలు, సెల్ ఫోన్స్, శాసనాల ప్రతులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరుస్తాం' అని సీఐ తెలిపారు.
తవ్వకాలకు పాల్పడుతున్న నిందితులను చాకచక్యంగా పట్టుకున్న ఎస్సై, సిబ్బందిని అభినందించారు.
ఇవీచూడండి:
రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో విజయవంతం
TAGGED:
గుప్త నిధుల కోసం తవ్వకాలు