ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అనంత' విషాదం.. 7 నెలల బాలుణ్ని జ్వరం మింగేసింది - కనగానిపల్లిలో జ్వరంతో ఏడునెలల బాలుడు మృతి

సంవత్సరం కూడా నిండని ఆ బాలుణ్ని... జ్వరం మృత్యువు రూపంలో మింగేసింది. తమ గారాల కుమారుడు ఇక లేడన్న నిజం తెలిసిన ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అనంతపురం జిల్లా కనగానిపల్లిలో జరిగిన విషాద ఘటన వివరాలివి..!

seven months baby boy dies due to fever in kanaganipally at ananthapur
జ్వరంతో ఏడు నెలల బాలుడు మృతి

By

Published : Aug 7, 2020, 1:14 AM IST

అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం మల్లవరం గ్రామంలో విషాదం జరిగింది. జ్వరంతో రోహన్​ అనే 7 నెలల బాలుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన చండ్రాయుడు, అనితల కుమారుడు రోహన్​కు జ్వరం రావడంతో స్థానికంగా ఓ ఆర్​ఎంపీ వైద్యునికి చూపించారు. ఆ వైద్యుడు టానిక్​ ఇవ్వడంతో తిరిగి ఇంటికి వెళ్లారు. అయినా బాలునికి జ్వరం తగ్గలేదు.

ఈ క్రమంలో రోహన్​ను చికిత్స నిమిత్తం 40 కిలోమీటర్ల దూరంలోని ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. తమ బిడ్డ ఇక లేడన్న నిజం తెలుసుకున్న ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ దృశ్యం అక్కడి వారిని కలిచివేసింది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details