'రైల్వైే ప్రైవేటీకరణ వద్దంటూ గుత్తిలో ధర్నా'
గుత్తిలో రైల్వే బుకింగ్ కార్యాలయం వద్ద రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. రైల్వే ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకుంటే ధర్నా ఉద్దృతం చేస్తామని హెచ్చరించారు
'రైల్వైే ప్రైవేటీకరణ వద్దంటూ గుత్తిలో ధర్నా'
కేంద్ర ప్రభుత్వం రైల్వే ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా గుత్తిలో రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో రైల్వే కార్మికులు ధర్నా నిర్వహించారు. ప్రైవేటీకరణ విధానాన్ని ఆపకపోతే డివిజన్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు నిరసనలు చేపడతామని యూనియన్ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైల్వే కార్మికులు సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలని కోరారు.