ప్రయాణికుల అవసరాల దృష్ట్యా కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ ఆర్టీసీ బస్సులను నడుపుతోంది. అయితే బస్సు ఎక్కాలనే ఆత్రుతతో ప్రయాణికులు కరోనా మహమ్మారి గురించి పట్టించుకోవడం లేదు. గుంపులు గుంపులుగా ఎగబడి బస్సు ఎక్కేస్తున్నారు.
గమ్యంపైనే ఆత్రుత..భౌతిక దూరంపై లేదు జాగ్రత్త - అనంతపురంలో ఆర్టీసీ బస్సులు
బస్సు ఎక్కాలనే తొందరలో ప్రయాణికులు భౌతిక దూరం పాటించడం లేదు. గుంపులు గుంపులుగా ఎగబడి బస్సులు ఎక్కేస్తున్నారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే ప్రమాదం తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు.
అనంతపురం జిల్లా కదిరి నుంచి మదనపల్లె వరకు బస్సు సర్వీసులు నడుపుతున్నారు. మడకశిర, అనంతపురం ఉరవకొండ డిపో తిరుపతికి సర్వీసులను నడుపుతోంది. వివిధ ప్రాంతాల నుంచి మదనపల్లె, తిరుపతి వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో ప్రయాణికులు వస్తున్నారు. బస్సులు తక్కువగా ఉండటం వల్ల ఎలాగైనా గమ్యం చేరుకోవాలనే ఆత్రుత ప్రయాణికులకు ఎక్కువైంది. ఈ క్రమంలో వారు భౌతిక దూరం పాటించడం లేదు. గుంపులు గుంపులుగా ఒకేసారి బస్సులు ఎక్కుతున్నారు. దీంతో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి కరోనా బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి:ఆశ్రయం కల్పించినవారే.. అంతమెుందించారు..!