అనంతపురం జిల్లా తాడిపత్రి పప్పూరు రోడ్డు వద్ద లారీ, బైక్ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. కుమ్మేత గ్రామానికి చెందిన కుమ్మర మల్లికార్జున ద్విచక్రవాహనంపై వెళ్తుండగా తాడిపత్రి పట్టణం పప్పూరు హైవే వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ఘటనలో మల్లికార్జున అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ.. వ్యక్తి దుర్మరణం - తాడిపత్రిలో రోడ్డు ప్రమాదం వార్తలు
ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఘటనా స్థలంలో మృతిచెందిన వ్యక్తి