అనంతపురంలో బెంగళూరు, హైదరాబాద్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. అనంత గ్రామీణం, ఒడియంపేటకు చెందిన కొంతమంది కూలీలు పని నిమిత్తం ఆటోలో బుక్కచెర్ల గ్రామానికి వెళ్ళి వస్తుండగా ఐచర్ వాహనం ఆటోను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు ఒడియం పేటకు చెందిన స్వాతి, సులోచన గా పోలీసులు గుర్తించారు. గాయాలైన ఆరుగురిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.