అనంతపురం జిల్లా గాండ్లపెంటకు చెందిన సలీం అనే వ్యక్తి ఉపాధి కోసం కువైట్కు వెళ్లాడు. వీసా గడువు ముగియడంతో సలీం స్వదేశానికి బయలుదేరినట్లు కుటుంబ సభ్యులకు తెలిపాడు. ఫోన్ చేసిన కొన్ని గంటల తర్వాత...భారత్కు బయలుదేరేముందు తన గదిలో హత్యకు గురయ్యి...రక్తపు మడుగులో పడున్నాడు. అక్కడే ఉంటున్న ఆయన బంధువు సలీం కుటుంబ సభ్యులకు ఈ వార్తను చేరవేశాడు. ఈ హత్యకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. హత్య గురించి తెలియగానే ఆ కుటుంబంలో ఒక్కసారి విషాద చాయలు అల్లుకున్నాయి.
ఉపాధి కోసం వెళ్లి...ప్రాణాలు వదిలాడు - gandlapeta
చాలా కాలం తర్వాత ఇంటికి వస్తానన్న వ్యక్తి తిరిగిరాని లోకాలకు వేళ్లిపోయాడు. దీంతో ఒక్కసారిగా కుటుంబంలో పిడుగుపటడ్డటయ్యింది. ఉపాధి కోసం సౌదీకి వెళ్లిన అనంతపురం జిల్లావాసి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. అక్కడే ఉంటున్న వారి బంధువు ఈ సమాచారాన్ని కుటుంబ సభ్యులను చేరవేయడంతో వారి రోదనలు మిన్నంటాయి.
అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన అనంతపురం జిల్లావాసి సలీం