ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీ రంగరాయల చెరువు నుంచి నీటి విడుదల

అనంతపురం జిల్లాలోని శ్రీ రంగరాయల చెరువు నుంచి ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి నీటిని వదిలారు. పంట పండించడానికి సరిపోయే నీరున్నందున రైతులందరూ సాగు చేయాలని పిలుపునిచ్చారు. తాతల కాలంలో నిండిన చెరువు మళ్లీ జగన్​ సీఎం అయ్యాకే నిండిందన్నారు.

శ్రీ రంగరాయల చెరువు నుంచి  నీటి విడుదల
శ్రీ రంగరాయల చెరువు నుంచి నీటి విడుదల

By

Published : Dec 22, 2020, 6:59 PM IST

అనంతపురం జిల్లాలోని శింగనమల మండలంలోని 15 గ్రామాల ప్రజలకు జీవనాదారమైన శ్రీ రంగరాయల చెరువు నుంచి ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి నీటిని వదిలారు. పూజలు నిర్వహించిన అనంతరం ఆయకట్టు కాలువలకు తూముల ద్వారా నీటిని విడుదల చేశారు.

శింగనమలలో పండిన వరి ధాన్యానికి ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. పంటకు సరిపోయేంత నీరు ఉన్నందున రైతులు సాగు చేయటానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తాతల కాలంలో చెరువును నిండుకుండలా ఉండడం చూశామని..ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత శింగనమల చెరువు నిండుకుండలా మారిందన్నారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details