ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లాక్​డౌన్ వేళ ఉపాధి కల్పిస్తోన్న ఆర్డీటీ - RDT gives employment on women's at ananthapuram

లాక్‌డౌన్‌తో..ఎన్నో కుటుంబాలకు ఉపాధి గల్లంతైంది. పూట గడవడమే కష్టంగా మారింది. పనుల కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి అండగా నిలుస్తోంది అనంతపురంలోని రూరల్‌ డెవలప్‌మెంట్ ట్రస్ట్‌..! పేద, దివ్యాంగ మహిళలకు మాస్కులు కుట్టే పని కల్పిస్తోంది.

లాక్​డౌన్ వేళ ఉపాధి కల్పిస్తోన్న ఆర్డీటీ
లాక్​డౌన్ వేళ ఉపాధి కల్పిస్తోన్న ఆర్డీటీ

By

Published : Apr 19, 2020, 5:12 AM IST

Updated : Apr 23, 2020, 9:25 AM IST

లాక్​డౌన్ వేళ ఉపాధి కల్పిస్తోన్న ఆర్డీటీ

లాక్‌డౌన్‌ సమయంలో పని దొరక్క, డబ్బులు లేక నిరుపేదలు, రోజు కూలీలు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఎవరైనా దయార్ద్రులు ఆహరం పంపిణీ చేస్తేనే వారి పొట్ట నిండేది. అయితే దాతృత్వంలోనూ కాస్త భిన్నంగా ఆలోచించింది... అనంతపురం జిల్లాలోని ఆర్డీటీ సంస్థ. గత 25 రోజులుగా జిల్లాలోని పేదల కాలనీల్లో రోజూ 2 పూట్లా ఆహారమందించడమేగాక,.. కరోనా నుంచి రక్షణగా ఆయా ప్రాంతాల్లోని వారికి మాస్కులు పంపిణీ చేస్తోంది. ఇప్పటికే దాదాపు 40వేల మాస్కులను అందజేసింది. జిల్లాలోని బుక్కరాయసముద్రం, కల్యాణదుర్గం, కూడేరు, ఊడేగోళం, బత్తలపల్లిలో మహిళల చేత వీటిని తయారు చేయిస్తోంది.

మాస్కులు తయారుచేసిన మహిళలకు... ఒక్కో దానికి 5 రూపాయల చొప్పున అందిస్తున్నామని ఆర్డీటీ ప్రతినిధులు చెబుతున్నారు. ఆర్డీటీ చేస్తున్న ఈ ప్రయత్నానికి సర్వత్రా అభినందనలు వ్యక్తమవుతున్నాయి.

ఇవీ చదవండి.

'ప్రభుత్వం ఆదుకున్నట్లు క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు'

Last Updated : Apr 23, 2020, 9:25 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details