అనంతపురం జిల్లా తనకల్లు మండలం బిసనవారిపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తి ఆవును తప్పించబోయి కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. బిసనవారిపల్లి గ్రామానికి చెందిన ధనుంజయ, గజ్జల రమణ ద్విచక్రవాహనంపై వెళ్తుండగా...ప్రమాదం చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన ధనుంజయను కదిరి ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ధనుంజయ మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి - అనంత రోడ్డు ప్రమాదం న్యూస్
ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓవ్యక్తి ఆవును తప్పించబోయి...కింద పడి ప్రాణాలు కోల్పోయాడు ఈ ఘటన అనంతపురం జిల్లా బిసనవారిపల్లి వద్ద చోటుచేసుకుంది.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి