ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లా ఏర్పాటు చేయాలని అఖిలపక్షాల నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలో సమావేశం నిర్వహించారు. జిల్లా ఏర్పాటుకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు పుట్టపర్తిలో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. పరిశ్రమల స్థాపనకు అవసరమై భూములు అందుబాటులో ఉన్నాయని వివరించారు. సత్యసాయి జిల్లా సాధనకు ఐకాస కమిటీ ఏర్పాటు చేసి పార్టీలకతీతంగా పోరాటం చేస్తామని చెప్పారు. త్వరలో ముఖ్యమంత్రి జగన్ను కలిసి పుట్టపర్తి కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని వినతిపత్రం సమర్పిస్తామని తెలిపారు.
'పుట్టపర్తి కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలి' - పుట్టపర్తిలో ఆందోళన
పుట్టపర్తి కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని అఖిలపక్షాల నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా సాధనకు పార్టీలకతీతంగా పోరాటం చేస్తామని పేర్కొన్నారు.
'పుట్టపర్తి కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలి'