అనంతపురం జిల్లా శింగనమల మండలం గంపమల్లయ్యస్వామి కొండపై విషాదం చోటు చేసుకుంది. కొండపై నుంచి జారిపడి పూజారి మృతి చెందారు. స్వామివారికి పూజలు చేస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడిన పూజారి పాపయ్య ప్రాణాలు విడిచారు. ఎత్తయిన కొండల మధ్య అడవిలో గంపమల్లయ్య స్వామి కొలువై ఉన్నారు.
Live Video: కొండపై నుంచి జారిపడి పూజారి మృతి..లైవ్ వీడియో
11:10 August 21
కొండపై నుంచి జారిపడి పూజారి మృతి
కొండ ప్రత్యేకత ఏంటంటే?
ఆకాశాన్ని తాకే కొండలు.. క్రూర మృగాలు సంచరించే అటవీ ప్రాంతం... నరమానవుడు కనిపించని చోటు.. అంతటి ఎత్తైన ప్రాంతంలో వెలసి ఉంది ఈ ఆధ్యాత్మిక క్షేత్రం. ఇక్కడికి చేరుకోవడమే ఓ సాహసం. ఇదేదీ.. అక్కడి ప్రజలను ఆపలేదు. ఆ ఆలయంలో పూజారి చేసే సాహసాన్ని అడ్డుకోలేదు. శ్రావణ మాసం వచ్చిందంటే.. ఆ కొండపై నిత్యం జాతరే. స్వామికి పూజారి చేసే సాహసం అయితే, హాలీవుడ్ సినిమాల్లోనూ మనం చూసి ఉండం. ఆకాశానికి సమానంగా ఉన్నట్లుగా కనిపించే నున్నటి కొండపై వందల ఏళ్లుగా పారుతున్న దీపపు నూనె ధారాలు, దీనికి తోటు వర్షం నీరు పారిన పాచి చారల మీదుగా పూజారి ఎలాంటి సహాయం లేకుండా కిందకు దిగి హారతి ఇచ్చే కార్యక్రమం.. ఒక సాహాసోపేతమైన అనుభూతిని భక్తులకు మిగులుస్తుంది. శ్రావణ మాసంలో ప్రతి శనివారం అక్కడ జరిగే పండుగను చూసేందుకు వేలాదిగా తరలివస్తారు. ఎంతో కష్టమైనా.. వృద్ధులు, చిన్న పిల్లలు శుక్రవారం రాత్రికే అక్కడికి చేరుతారు.. ఈ సాహసోపేతమైన ఆధ్యాత్మిక యాత్రను గతంలో ఈటీవీ భారత్ ప్రత్యేకంగానూ చిత్రీకరించింది.
వీడియో కోసం లింక్ క్లిక్ చేయండి: