అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో కోవిడ్ ముందస్తు పరీక్షలు ప్రారంభించారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, వలస కూలీలకు, బ్యాంకు ఉద్యోగులకు ఈ పరీక్షలు చేపట్టారు. విడపనకల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిణి రాజేశ్వరి ఆధ్వర్యంలో ఈ పరీక్షలు నిర్వహించారు. ఎస్సై గోపి.. వారి సిబ్బంది ముందుగా ఈ పరీక్షలు చేయించుకున్నారు. వలస కూలీలకు దగ్గు, జలుబు, జ్వరం ఇతర లక్షణాలు ఉన్నవారిని గుర్తించి పరీక్షలు చేస్తున్నామన్నారు.
ఉరవకొండలో కరోనా ముందస్తు పరీక్షలు ప్రారంభం
అనంతపురం జిల్లాలోని ఉరవకొండలో కరోనా ముందస్తు పరీక్షలు ప్రారంభించారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, పోలీసు సిబ్బంది, వలస కూలీలకు ముందుగా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఉరవకొండలో ముందస్తు కరోనా పరీక్షలు