ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎస్ఆర్పీ పైప్​లైన్ లీక్.. వృథాగా పోతున్న నీరు - కళ్యాణదుర్గం శివార్లలో శ్రీ రామ్ రెడ్డి నీటి పథకం పైప్ లైన్ లీక్్

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం శివార్లలో ఎస్ఆర్పీ మంచినీటి సరఫరా పైపులైన్ లీక్ అయ్యింది. నీరు వృథాగా పోతోంది. అధికారులు స్పందించి మరమ్మతులు చేపడుతున్నారు.

pipe line leak in anantapur district
ఎస్ఆర్పీ పైప్ లైన్ లీక్.. వృధాగా పోతున్న నీరు

By

Published : Jan 28, 2021, 5:31 PM IST

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం శివార్లలో శ్రీరామ్​రెడ్డి నీటి పథకానికి సంబంధించిన పైపులైన్ లీక్ అయ్యి నీరు వృథాగా పోతోంది. కళ్యాణదుర్గం నుంచి ఖమ్మం వరకు వెళ్లే ప్రధాన రహదారిలో కస్తూర్భా పాఠశాల భవన సముదాయాల ముందు పైప్​లైన్ ధ్వంసం అయ్యింది. నీరు పైకి జిమ్ముతూ ఫౌంటెయిన్​లా మారింది.

సమాచారం అందుకున్న సంబంధిత అధికారులు నీటి పంపిణీని నిలిపివేసి.. మరమ్మతులు చేసేందుకు సమాయత్తమయ్యారు. పైపులైన్​కు లీక్ ఏర్పడటం వల్ల ఒకట్రొండు రోజులు కంబదూరు ప్రాంతం వైపు ఉన్న గ్రామాలకు మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details