తమను ప్రభుత్వం ఆదుకోవాలంటూ అనంతపురం జిల్లా మడకశిరలో ఫొటోగ్రాఫర్స్ బంద్ పాటించారు. కరోనా కారణంగా ఫొటో, వీడియోగ్రాఫర్ల రంగం కుదేలైందని ఆవేదన చెందారు.
దుకాణాలకు అద్దెలు చెల్లించుకోక... నిర్వాహకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ రంగాన్ని కూడా ప్రత్యేక వృత్తిగా గుర్తించి సమస్యలు పరిష్కరించాలని మడకశిర ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు.