కరోనాతో పాఠశాలలకు సెలవులు అమలవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. కొంతమంది బడులను మాంసపు విక్రయ, వధ కేంద్రాలుగా, పశువుల కేంద్రాలుగా మార్చేశారు. ఈ ఘటన అనంతపురంలోని శ్రీనివాస్ నగర్లో జరిగింది.
అక్కడి ప్రాథమిక పాఠాశాలలో కొంతమంది వ్యక్తులు జంతువులను వధించి.. అక్కడే మాంసాన్ని విక్రయిస్తున్నారు. ఈ విషయం తెలిసిన నగరపాలక అధికారులు, పోలీసులు.. పాఠశాల వద్దకు వెళ్లి నిందితులను అరెస్టు చేశారు. పాఠశాలలో ఇటువంటి పనులు చేస్తే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.