అమర జవాన్ల వీరమరణాలకు నివాళిగా అనంతపురం జిల్లా హిందూపురంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు ర్యాలీ చేసి.. వీర జవాన్లకు జోహర్ అంటూ నినదించారు. చైనా దుశ్చర్యకు ప్రతీ భారతీయుడు ఆ దేశ వస్తువులు, యాప్లను బహిష్కరించాలని అన్నారు. మానవహారంగా ఏర్పడి రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్దాంజలి ఘటించారు.
అమర సైనికులకు నివాళిగా హిందూపురంలో శాంతిర్యాలీ - హిందూపురంలో ర్యాలీ
గాల్వన్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు నివాళిగా అనంతపురం జిల్లా హిందూపురంలో శాంతిర్యాలీ నిర్వహించారు. మానవహారంగా ఏర్పడి శ్రద్ధాంజలి ఘటించారు.
సైనికుల వీర మరణాలకు నివాళిగా హిందూపురంలో శాంతిర్యాలీ