వ్యవసాయ బిల్లులకు, వ్యవసాయ విద్యుత్ మోటార్లకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 10న అనంతపురంలో రాష్ట్రస్థాయి ట్రాక్టర్ల ర్యాలీని చేపట్టనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ స్పష్టం చేశారు. దేశంలో ప్రధాని మోదీ..,రాష్ట్రంలో జగన్ ప్రజల విశ్వాస ఘాతుకానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. నాలుగేళ్ల క్రితం నోట్లు రద్దు చేసి..నక్సలిజం, ఉగ్రవాదం, దొంగనోట్లు అంతమైపోతాయని ప్రలోభ పెట్టి మోసం చేశారన్నారు. కేవలం ఆదాని, అంబాని లాంటి వాళ్ళ నల్లడబ్బును మార్చడానికి ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. దేశ వ్యవస్థను ప్రైవేటీకరణ చేసి ప్రజలను బానిసల్లా చేయడానికి కుట్ర పన్నుతున్నారన్నారు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని..,ఈ ప్రభుత్వాలపై ప్రజలు తిరగబడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
'మోదీ, జగన్ ప్రజల విశ్వాస ఘాతుకానికి పాల్పడుతున్నారు'
దేశంలో ప్రధాని మోదీ..రాష్ట్రంలో జగన్ ప్రజల విశ్వాస ఘాతుకానికి పాల్పడుతున్నారని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ఆరోపించారు. వ్యవసాయ బిల్లులకు, వ్యవసాయ విద్యుత్ మోటార్లకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 10న అనంతపురంలో రాష్ట్రస్థాయి ట్రాక్టర్ల ర్యాలీని చేపట్టనున్నట్లు తెలిపారు.
'మోదీ, జగన్ ప్రజల విశ్వాస ఘాతుకానికి పాల్పడుతున్నారు'