ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రండి బాబూ రండి.. కిలో ఉల్లి ధర రూ.25 మాత్రమే!

ప్రభుత్వం రాయితీపై ఉల్లిని ప్రజలకు సరఫరా చేస్తోంది. ప్రజల నుంచి మంచి స్పంద లభిస్తోంది. కర్నూలు మార్కెట్ యార్డులో రైతుల నుంచి కిలో రూ.50 నుంచి రూ.56కు కొనుగోలు చేసి... అనంతపురం రైతు బజార్​లో రూ.25కే విక్రయిస్తున్నారు. రెండు రోజులకు 5 టన్నుల చొప్పున కర్నూలు నుంచి తీసుకొచ్చి ప్రజలకు సరఫరా చేస్తున్నారు.

on subsidy government giving onions at ananthapuram
అనంతపురంలో రాయితీపై ఉల్లి విక్రయిస్లుతున్న ప్రభుత్వం

By

Published : Nov 26, 2019, 6:40 PM IST

Updated : Nov 26, 2019, 8:33 PM IST

అనంతపురంలో రాయితీపై ఉల్లి విక్రయిస్తున్న ప్రభుత్వం

మండిపోతున్న ఉల్లి ధరలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. రాయితీపై ఉల్లి పంపిణీ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోంది. అనంతపురం జిల్లా రైతు బజార్​లో కిలో రూ.25 పంపిణీ చేస్తున్నారు. దీంతో ప్రజలు మార్కెట్ వద్ద బారులు తీరారు. ముఖ్యమంత్రి మంచి నిర్ణయం తీసుకున్నారంటూ ప్రజలు సంతోషిస్తున్నారు.


ఇదీ చదవండి:

Last Updated : Nov 26, 2019, 8:33 PM IST

ABOUT THE AUTHOR

...view details