పసిడి, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధాని దిల్లీలో నేడు 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.68 తగ్గింది. ప్రస్తుత ధర రూ.38,547కి చేరింది.
దేశీయంగా పసిడి కొనుగోళ్ల డిమాండు తగ్గడమే ధరల క్షీణతకు కారణమని నిపుణులు అంటున్నారు. డాలర్‌తో పోలిస్తే.. రూపాయి బలపడుతుండటమూ పసిడి ధరల తగ్గుదలకు మరో కారణంగా చెబుతున్నారు.
కిలో వెండి ధర నేడు (దిల్లీలో) రూ.39 తగ్గి.. రూ.45,161 వద్దకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో.. ఔన్సు బంగారం ధర 1,455.30 డాలర్ల వద్ద.. వెండి ఔన్సుకు 16.88 డాలర్ల వద్ద ఫ్లాట్‌గా ఉన్నాయి.
ఇదీ చూడండి: భారత్‌లో 'ఐఫోన్ ఎక్స్ఆర్' మొబైల్ తయారీ షురూ!