అనంతపురం జిల్లా తలపుల గ్రామంలో బ్యాంకుల వద్దకు పెద్ద సంఖ్యలో రైతులు తరలివచ్చారు. భౌతిక దూరాన్ని విస్మరించి ఎగబడ్డారు. రుణాలు నవీకరణ చేసుకునే రైతులు ముందుగా టోకెన్లు తీసుకోవాలని పల్లెల్లో చాటింపు వేయించారు. టోకెన్ల కోసం ఉదయం ఎనిమిది గంటలకే బ్యాంకు వద్దకు రైతులు చేరుకొని వరుసలో నిల్చున్నారు.
జిల్లాలో కరోనా అనుమానితుల సంఖ్య పెరుగుతున్న కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కదిరి లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవసాయ శాఖ ఎదుట పెద్ద సంఖ్యలో రైతులు గుమిగూడారు. బ్యాంకు అధికారులు సమస్య తీవ్రతను గుర్తించి భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.