ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సమయానికే సీమ జిల్లాలకు నైరుతి.. నేడు, రేపు మోస్తరు వర్షాలు

అనుకున్న సమయానికే నైరుతి రుతుపవనాలు రాయలసీమ జిల్లాల్లో ప్రవేశించాయని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. మరో రెండుమూడు రోజుల్లో అవి మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని తెలిపింది.

By

Published : Jun 5, 2021, 7:37 AM IST

monsoons on time
సమయానికే సీమ జిల్లాలకు నైరుతి

అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. దీంతోపాటు కేరళలోని అన్ని ప్రాంతాలకు, కర్ణాటకలోని దక్షిణ ప్రాంతాలకు, కోస్తా కర్ణాటకలోని పలు ప్రాంతాలకు విస్తరించినట్లు అమరావతి వాతావరణ కేంద్రం శుక్రవారం తెలిపింది. దక్షిణ అరేబియా సముద్రం, నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ తూర్పు, మధ్య బంగాళాఖాతం, లక్షద్వీప్‌, మధ్య అరేబియా సముద్రంలోనూ విస్తరించాయని వివరించింది.

రానున్న.. 2,3 రోజుల్లో రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని వాతావరణ కేంద్రం వివరించింది. అనంతపురం జిల్లాలోని బుక్కరాయపట్నంలో అత్యధికంగా 124.5 మి.మీ. వర్షపాతం నమోదయింది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం నందరాడలో 111 మి.మీ. వర్షం కురిసింది. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు విజయవాడలో 42 మి.మీ. కురిసింది. రాష్ట్రంలో పలు చోట్ల శని, ఆదివారాల్లో తేలికపాటినుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది.

సరైన సమయానికే రుతుపవనాలు...

నైరుతి రుతుపవనాలు సాధారణంగా ఏటా జూన్‌ 4 నాటికి రాష్ట్రంలో ప్రవేశించాలి. ఈ ఏడాది సరైన సమయానికే వచ్చాయి. కిందటేడాది 3రోజులు ఆలస్యంగా వచ్చాయి. రాష్ట్రమంతటా సాధారణంగా జూన్‌ 11 నాటికి నైరుతి రుతుపవనాలు విస్తరించాల్సి ఉంది. దాదాపు అలాగే జరగనుందని పేర్కొంటున్నారు.

ఇవీ చదవండి:

'అలా చేస్తే.. కరోనా 3.0 తప్పదు'

CPI Narayana: 'రాజద్రోహం చట్టం (124-A)ను తక్షణమే రద్దు చేయాలి'

ABOUT THE AUTHOR

...view details