అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని ప్రభుత్వ వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాలలో.. ఇంజినీర్స్ డే సందర్భంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అధ్యాపకులు నివాళులర్పించారు. ఆధునిక భారతావనికి ఇంజినీరింగ్ పునాదులు వేసిన మహామేధావి, విద్యా ప్రదాత మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ రవిబాబు పేర్కొన్నారు.
ఘనంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి - మడకశిర వార్తలు
మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని ప్రభుత్వ వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు.
ఘనంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి