రాష్ట్రంలో పొలిటికల్ టెర్రరిజం మొదలైందని తెదేపా ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో దీపక్‌రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నేతలపై దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దాడులపై హోంమంత్రి సుచరిత మాట్లాడిన తర్వాత కూడా... అనంతపురం జిల్లా శింగనమలలో తెదేపా కార్యకర్తలకు చెందిన పంటలు ధ్వంసం చేశారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి దాడులపై ఫిర్యాదు చేయడానికి టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
పొలిటికల్ టెర్రరిజం మొదలైంది: దీపక్‌రెడ్డి
వైకాపా అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో బెదిరింపులకు దిగుతున్నారని ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. బడ్జెట్ సమావేశాలు జరిగేలోపు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన దాడులకు సంబంధించిన నివేదిక ప్రభుత్వానికి అందిస్తామని చెప్పారు.
ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి