మాజీ ఎమ్మెల్యేకు బాలయ్య పరామర్శ - ap latest news
ఎమ్మెల్యే బాలకృష్ణ శుక్రవారం మాజీ శాసనసభ్యులు సీసీ వెంకట్రాముడుని ఆయన స్వగృహంలో పరామర్శించారు.
మాజీ ఎమ్మెల్యేను కలిసిన బాలయ్య
ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గత రెండురోజులుగా అనంతపురం జిల్లా హిందూపూర్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. నేడు మాజీ శాసనసభ్యులు సీసీ వెంకట్రాముడిని మర్యాద పూర్వకంగా కలిసి పరామర్శించారు. జర్నలిస్టుల ఇంటి స్థలాల సమస్యలను ఆయన బాలకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు. భౌగోళిక పరిస్థితులను పరిశీలించిన ఎమ్మెల్యే గృహాలకు పట్టాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. సీసీ వెంకట్రాముడు 1999 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కె. తిప్పెస్వామిపై విజయం సాధించారు.