అనంతపురం జిల్లా హిందూపురం కొవిడ్ ఆసుపత్రికి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రూ. 55 లక్షల విలువచేసే ఔషధాలు, పరికరాలు అందించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధి కోసం అందరం కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. తాను ఎక్కడున్నా హిందూపురం నియోజకవర్గం గురించి ఆలోచిస్తూనే ఉంటానని.. అక్కడి సమస్యల గురించి మంత్రులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని మంత్రి ఆళ్ల నానిని కోరగా.. ఆయన స్థల పరిశీలన చేసి కళాశాల మంజూరయ్యేలా చేస్తానని చెప్పినట్లు వెల్లడించారు.
కొవిడ్ ఆసుపత్రికి ఔషధాలు, పరికరాలు అందించిన బాలకృష్ణ - హిందూపురం ఆసుపత్రికి మందులు అందజేసిన బాలకృష్ణ వార్తలు
తన నియోజకవర్గమైన హిందూపురం కొవిడ్ ఆసుపత్రికి ఎమ్మెల్యే బాలకృష్ణ ఔషధాలు, పరికరాలు అందించారు. తాను ఎక్కడున్నప్పటికీ నియోజకవర్గం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటానని తెలిపారు.
హిందూపురం కొవిడ్ ఆసుపత్రికి ఔషధాలు, పరికరాలు అందించిన బాలకృష్ణ