వైకాపా నేతలపై జిల్లా ఎస్పీకి మంత్రి పరిటాల సునీత ఫిర్యాదు చేశారు. అనంతపురం జిల్లా వైకాపా నేతలపై జిల్లా ఎస్పీకి మంత్రి పరిటాల సునీత ఫిర్యాదు చేశారు. రాప్తాడులోని వైకాపా అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి... ఇంటింటి ప్రచారం చేస్తూ ప్రజలను తమకు ఓటేయాలని బెదిరిస్తున్నట్లు ఆరోపించారు. రాత్రి వేళ గ్రామాల్లో తిరుగుతూ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సునీత తెలిపారు. రెండు రోజుల క్రితం మరో వైకాపా నేత రాజశేఖర్ రెడ్డి వాహనంలో కర్రలు దొరికిన విషయం, గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులను ఎస్పీ అశోక్ కుమార్కు వివరించినట్లు తెలిపారు. శాంతి కోసం తాము ప్రయత్నిస్తుంటే విద్వేషాలు రెచ్చగొట్టేందుకు వైకాపా ప్రయత్నిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా స్వేచ్ఛగా ఓటేయాలని ప్రజలకు మంత్రి సూచించారు.
ఇవీ చూడండి.