అనంతపురం జిల్లా, పెనుకొండ మండలంలోని గుట్టూరు గ్రామంలో నిర్వహించిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రహదారులు, భవనాల శాఖా మంత్రి శంకరనారాయణ హాజరయ్యారు. 95 మంది లబ్ధిదారులకు పట్టాలను అందించారు. మహిళలు ఆర్ధికంగా అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల్లో స్త్రీలకు సీఎం జగన్ పెద్దపీట వేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవాలంటే మండల కేంద్రంలోని తహసీల్దార్, అభివృద్ధి, వ్యవసాయ, ఇతర అధికారుల కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేదని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందేలా గ్రామసచివాలయ, వాలంటరీ వ్యవస్థలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను గ్రామ సచివాలయంలోనే పరిష్కరించుకోవచ్చని తెలిపారు. అనంతరం మంత్రి జన్మదినం సందర్భంగా కేకు కోసి మిఠాయిలు పంచారు.
95 మందికి ఇళ్ల పట్టాలను అందించిన మంత్రి
మహిళలు ఆర్ధికంగా అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో జగన్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల్లో స్త్రీలకు పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ అన్నారు. అనంతపురం జిల్లా, పెనుకొండ మండలంలోని గుట్టూరులో 95 మంది లబ్ధిదారులకు ఆయన ఇళ్ల పట్టాలను అందించారు. అనంతరం మంత్రి జన్మదినం సందర్భంగా కేకు కోసి మిఠాయిలు పంచారు.
95 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందించిన రాష్ట్ర మంత్రి