ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బియ్యపు గింజలు... అతని చేయి తాకితే కళాఖండాలు

బియ్యపు గింజలతో అతను అద్భుతాలు చేయగలడు. రాజకీయ నాయకులు, స్వాతంత్య్ర సమరయోధులు ఇలా ఎవరి రూపాన్నైనా బియ్యపు గింజలతో స్పష్టించగలడు.

సుధాకర్

By

Published : Jun 2, 2019, 8:02 AM IST

కళాకారుడు

అనంతపురం జిల్లా లేపాక్షి మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన సుధాకర్ సూక్ష్మకళలో తనకంటూ ప్రత్యేకతను చాటుకంటున్నారు. తన తాత, తండ్రి నుంచి అబ్బిన విద్యతో అద్భుతాలు చేస్తున్నారు. బియ్యం, జొన్న వంటి గింజలపై కళాఖండాలు వేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. కొన్నేళ్ల క్రితం వ్యవసాయంలో నష్టాలు వచ్చి ఆర్థికంగా చితికిపోయిన ఇతన్ని తన కళ ఆదుకుంది.

లేపాక్షి ఆలయం ముందు ఓ చిన్న స్టాండ్ ఏర్పాటు చేసుకుని తన చిత్రలేఖ కళను ప్రదర్శిస్తూ ఆర్థికంగా మొరుగయ్యారు. బియ్యపు గింజపై జాతీయ నాయకులు, స్వాతంత్ర సమరయోధుల చిత్రాలు వేయగలరు. ఒక గింజపై పేర్లు నాలుగు పేర్లను రాయగలరు. లేపాక్షికి వచ్చే పర్యాటకులను తన సూక్ష్మకళతో ఆకట్టుకుంటున్నారు.

రోజూ ఉదయాన్నే లేపాక్షి నంది విగ్రహం వద్దకు వచ్చి, పర్యాటకలు కోరిన చిత్రాలను గింజలపై వేయడం ఇతని వృత్తి. తనకు చాలా మంది ప్రముఖుల నుంచి చిత్రాలు వేయడానికి ఆర్డర్లు వస్తున్నాయని సుధాకర్ చెబుతున్నారు. ప్రత్యేక కళతో రాణిస్తోన్న తనకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తే లేపాక్షిలో ఓ దుకాణం ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నారు సుధాకర్.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details