అనంతపురంలోని జేఎన్టీయూ కళాశాల మైదానంలో ఓ వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. బండరాయితో తలపై మోది హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు. మృతుడు అనంతపురంలో తాపీ మేస్త్రిగా పని చేసే ఎల్లప్పగా పోలీసులు నిర్ధారించారు.
ఎల్లప్ప పదేళ్ల క్రితం తన భార్యతో విడిపోయి ఒంటరిగా ఉంటున్నట్లు తెలిపారు. అతనికి మరో ఇద్దరు మహిళలతో సంబంధం ఉన్నట్లు తెలిపిన పోలీసులు.. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.