రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి న్యాయం చేయాలని అనంతపురంలోని ఓ గోల్డ్ దుకాణం వద్ద మృతదేహంతో బంధువులు ఆందోళన చేపట్టారు. గుత్తి ప్రాంతానికి చెందిన సునీల్ కుమార్ 12 ఏళ్ల నుంచి అనంతపురంలోని ఓ గోల్డ్ దుకాణంలో పని చేస్తున్నాడు. దుకాణం పని ముగించుకుని గుంతకల్లు నుంచి గుత్తి మీదుగా అనంతపురానికి వస్తుండగా.. వడియంపేట గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై కారు బోల్తా పడి మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. బంగారం దుకాణం వారు మృతుడి కుటుంబానికి సహాయం చేయాలని బంధువులు కోరారు. వారి నుంచి స్పందన రాకపోవడంతో ఆందోళన చేపట్టారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. న్యాయం చేయాలంటూ బంధువుల ఆందోళన
రోడ్డు ప్రమాదంలో ఓ బంగారం దుకాణంలో పనిచేసే వ్యక్తి మృతి చెందగా న్యాయం చేయాలంటూ బంధువులు మృతదేహంతో ఆందోళన నిర్వహించారు. దుకాణం పని ముగించుకుని వెళ్లొస్తుండగా ప్రమాదం జరిగిందని, బాధిత కుటుంబానికి సాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. న్యాయం చేయాలంటూ బంధువుల ఆందోళన
కంపెనీ పని కోసం వెళ్లి అతను మృత్యువాత పడ్డాడని పన్నెండేళ్లుగా సంస్థలో పని చేస్తున్నాడని బంధువులు తెలిపారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:బస్సు బోల్తా ఒకరు మృతి... 30 మందికి గాయాలు