అనంతపురం జిల్లా ధర్మవరంలో నీరజ అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. నేసేపేటకు చెందిన నీరజ భర్త జగదీశ్ తన భార్య ఇంట్లో ఉరివేసుకొని మృతి చెందిందని పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వివాహిత ఆత్మహత్య ...వేధింపులే కారణమా! - అనంతపురం జిల్లాలో ఆత్మహత్య వార్తలు
అనంతపురం జిల్లా ధర్మవరంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఉరి వేసుకుని అఘాయిత్యానికి పాల్పడింది. నాగేళ్లుగా అత్తింటి వాళ్లు తన కూతురుని వేధిస్తున్నారని బాధితురాలి తల్లి వాపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వివాహిత ఆత్మహత్య
నాలుగేళ్లుగా అత్తింటి వారు తన కుమార్తెను వేధిస్తున్నారని నీరజ తల్లి కళావతి పోలీసుల ఎదుట కన్నీటిపర్యంతమైంది. తన కుమార్తెను కొట్టి చంపి ఉరివేసి ఉంటారని ఆమె ఆరోపించింది. జగదీశ్, అతని కుటుంబ సభ్యులను పోలీసులు విచారిస్తున్నారు. శివానగర్‌కు చెందిన నీరజకు నేసేపేటకు చెందిన జగదీశ్‌తో నాలుగేళ్ల క్రితం వివాహం జరుగగా.. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు.
ఇదీ చదవండి :