కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న మోదీ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇస్తోందని కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు. లాక్డౌన్ వలన ఉపాధి కోల్పోయిన అసంఘటిత వలస కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మడకశిరలో ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, శ్రీ రామిరెడ్డి తాగునీటి పథకంలో పనిచేసే కార్మికులు, వివిధ శాఖల్లో పనిచేసే ఇతర కార్మికులు ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కరోనా మహమ్మారితో పోరాడుతున్న అంగన్వాడీ, ఆశ, వైద్య, ఆరోగ్య ఉద్యోగులకు, పారిశుద్ధ్య కార్మికులకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు, వాలంటీర్లకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మికులతో పాటు సీఐటీయూ నేతలు పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించాలని.. పలు రంగాల కార్మికులు ఆందోళన
అనంతపురం జిల్లా మడకశిరలో ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, శ్రీ రామిరెడ్డి తాగునీటి పథకంలో పనిచేసే కార్మికులు, వివిధ శాఖల్లో పనిచేసే ఇతర కార్మికులు ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేస్తూ ఎమ్మార్వోకు వినతిపత్రం అందించారు.
పలు రంగాల కార్మికులు ఆందోళన