ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

టిక్​టాక్​తో ప్రేమ... రాష్ట్రం దాటిన యువతులు - టిక్​ టాక్​ ప్రేమ

టిక్​టాక్​తో రెండు రాష్ట్రాలకు చెందిన... రెండు జంటలు ప్రేమలో పడ్డాయి... వారి ప్రేమ పెళ్లి వరకు వెళ్తుందని యువతులు కలలు కన్నారు. చివరికి యువకులు చేసిన మోసంతో వ్యవహారం మధ్యలోనే చెడింది.

టిక్​టాక్​తో ప్రేమ

By

Published : Nov 8, 2019, 12:49 PM IST

Updated : Nov 8, 2019, 6:44 PM IST

టిక్​టాక్​ పరిచయంతో ప్రేమలో పడిన ఇద్దరు యువతులు... యువకులను కలిసేందుకు గురువారం రాత్రి అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం దర్గా హోన్నూరుకు వెళ్లారు. తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా గజ్వేల్​ మండలానికి చెందిన ఇద్దరు యువతులకు... ఆరు నెలల కిందట దర్గాహోన్నూరుకు చెందిన వంశీ, వన్నూరు స్వామి అనే యవకులతో టిక్​టాక్​ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం పెళ్లి వరకు వచ్చింది. వారి మాటలు నమ్మి యువతులు ఆంధ్రాకు వెళ్తున్నామని చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరారు.

తీరా ఇక్కడకు వచ్చిన తర్వాత యువకులు మాట మార్చారు. పెళ్లికి నిరాకరించారు. గ్రామస్థులు జోక్యం చేసుకుని సర్దిచెప్పారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధిత యువతులను కళ్యాణదుర్గం ఉజ్వల హోమ్​కు తరలించారు. వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి అప్పగిస్తామని ఎస్​ఐ రమణారెడ్డి అన్నారు.

Last Updated : Nov 8, 2019, 6:44 PM IST

ABOUT THE AUTHOR

...view details