ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంతకల్లులో దొంగల బీభత్సం...బంగారు, వెండి, నగదు అపహరణ... - chori

అర్ధరాత్రి సమయంలో ఇంట్లో జనాలు లేని సమయం చూసి మరీ దొంగలు చోరీకి పాల్పడుతున్నారు.గుంతకల్లులోని సుమారు 6 తులాల బంగారం, 20 తులాలా వెండి, 42,500 రూపాయలు చాకచక్యంగా అపహరించుకుపోయారు.

గుంతకల్లులో దొంగల బీభత్సం

By

Published : Aug 2, 2019, 10:30 AM IST

గుంతకల్లులో దొంగల బీభత్సం

అనంతపురం జిల్లా గుంతకల్లులో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. ఇంటిలో మనుషులు లేని సమయం చూసి మాటువేసి... రాత్రి సమయాల్లో దోపిడీలకు పాల్పడుతున్నారు. ఈ విధంగానే పట్టణంలోని గంగానగర్ లో రామాంజనేయులు ఇంటిలో మంగళవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. బాధితుడు మాట్లాడుతూ.. తమ సోదరుడు గత నెలలో చనిపోవడంతో దేవాలయం దగ్గర నిద్ర చేయటానికి తమ ఇంటికి తాళంవేసి మొలగవెళ్లి సుంకులమ్మ ఆలయానికి వెళ్లామన్నారు. ఇదే అదనుగా భావించిన దుండగులు ఇంటితాళం పగులగొట్టి బీరువాలోని 6 తులాల బంగారు ఆభరణాలతో పాటు, 20 తులాల వెండి చైన్లు, 42,500 రూపాయల నగదు దోచుకెళ్ళారని వాపోయారు. ఇంటిపక్కల వారు చరవాణి ద్వారా బాధితులకు సమాచారం అందించగా.. హటాహుటీన వచ్చి చూడగా చిందర వందరగా పడి ఉన్న చీరలు, బీరువా ద్వంసం చేసిన దృశ్యాలు చూసి భార్య భర్తలిద్దరూ కన్నీరు మున్నీరయ్యారు.రజక వృత్తి చేస్తూ కూడ బెట్టిన సొమ్ముతో బంగారు కొన్నామని, తమ కూతురి గుర్తుగా దాచుకున్న నగలు దొంగలు పట్టుకెళ్లారని బాధితుడు భార్య ఆవేదన చెందుతున్నారు. జరిగిన విషయం స్థానిక పోలీసులుకు తెలుపగా విచారణ జరిపి కేసు నమోదు చేస్తామని తెలిపారు.
ఇదీ చూడండీ:స్నేహితుడి భార్యపై కన్నేశాడు.. అఘాయిత్యానికి ఒడిగట్టాడు

ABOUT THE AUTHOR

...view details