ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిరుతల సంచారం...భయాందోళనలో స్థానికులు

చిరుతల సంచారంతో అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండల పరిధిలోని గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కాగా చిరుతలను బంధించేందుకు చర్యలు తీసుకుంటామని అటవీశాఖ అధికారులు తెలిపారు.

By

Published : Jun 5, 2020, 9:58 AM IST

చిరుతల సంచారం...భయాందోళనలో స్థానికులు
చిరుతల సంచారం...భయాందోళనలో స్థానికులు

అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలం నల్లగుట్ట ప్రాంతంలో చిరుతల సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పీసీ ప్యాపిలి సమీప పరిసర ప్రాంతాల కొండ గుట్టల్లో గత కొన్ని రోజులుగా నాలుగు నుంచి ఐదు చిరుతలు సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. పొలాల్లో పని చేయాలంటే భయంగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చిరుతలను బంధించేందుకు చర్యలు తీసుకుంటామని అటవీశాఖ అధికారులు తెలిపారు. చాలా కాలంగా అవి ఇక్కడే అవాసలు ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నాయన్నారు. ఇటీవల పొలం పనులకు వెళ్లే రైతులకు కనపడినట్లు తెలిపారు. వాటి కదలికలపై నిఘా ఉంచామని చిరుతలు ఉన్నట్లయితే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బంధించి అడవిలో వదిలేస్తామని అటవీ అధికారి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details