అనంతపురం జిల్లాలోని ఇతర ప్రాంతాలకు కర్ణాటక మద్యాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను విడపనకల్లు మండలం డోనేకల్లు వద్ద పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 192 మద్యం సీసాలు, ఓ ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. సరిహద్దులో ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్ - karnataka liquor caught by donekallu police
ద్విచక్రవాహనంపై కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను డోనేకల్లు వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 192 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్