వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాల్లో భాగంగా కదిరిలోని ఓ ప్రైవేటు విద్యాసంస్థల ఆవరణలో అటవీశాఖ అధికారి శ్రీనివాసులు మొక్కలు నాటారు. తగ్గిపోతున్న అడవులను కాపాడుకుంటూ వన్య ప్రాణుల సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఆయన తెలిపారు. మొక్కలను కాపాడుకుని పచ్చదనాన్ని పెంచాలని విద్యార్థులకు సూచించారు. వన్య ప్రాణుల సంరక్షణ ఆవశ్యకతను వివరించారు. అనంతరం 'వన్యప్రాణులు- వాటి సంరక్షణ' అనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.
'వన్య ప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత'
తగ్గిపోతున్న అడవులను కాపాడుకుంటూ వన్య సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని కదిరి అటవీశాఖ అధికారి శ్రీనివాసులు అన్నారు. ఓ ప్రైవేటు విద్యాసంస్థల ఆవరణలో ఆయన మొక్కలు నాటారు.
కదిరి అటవీశాఖ అధికారి శ్రీనివాసులు
TAGGED:
kadiri latest news