తమకు శత్రువులు తెదేపాలోనే ఉన్నారని ఆ పార్టీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సామాజిక మాధ్యమాల్లో తమపై వ్యతిరేక పోస్టులు చేస్తుంది కూడా వారేనని ఆయన అన్నారు. అయినా కింది స్థాయిలోని కార్యకర్తల బాగోగులే తమకు ముఖ్యమని ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.
'నాకు తెదేపాలోనే శత్రువులున్నారు..'
పార్టీలోనే తమకు శత్రువులున్నారని తెదేపా మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. పార్టీలోనే కొందరు సామాజిక మాధ్యమాలల్లో తమపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తల బాగోగులే తమకు ముఖ్యమని ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అంతర్గత వ్యవహారాలు పక్కనబెట్టి పార్టీ అభివృద్ధి కోసం పనిచేయాలని కార్యకర్తలను కోరారు.
తెదేపా మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి
అనంతపురంలో తెదేపా కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన.. కార్యకర్తలు లేకుండా ఏ పార్టీ అయినా ఉనికిని కోల్పోతుందని అన్నారు. పార్టీ కార్యాలయం ప్రారంభించడం కాదని.. వివిధ సమస్యలతో వచ్చే ప్రజలకు సమాధానం చెప్పేలా ఉండాలని జేసీ పవన్‌కు సూచించారు. పేదలకు సాయం చేసే వ్యవస్థను నెలకొల్పేలా పని చేయాలని నాయకులకు, కార్యకర్తలకు చెప్పారు. అంతర్గత వ్యవహారాలు పక్కనబెట్టి పార్టీ అభివృద్ధి కోసం పనిచేయాలని కార్యకర్తలను ఆయన కోరారు.