జనతా కర్ఫ్యూకు అనంత ప్రజల మద్దతు - carona virus latest news in ananthapuram district
కోవిడ్-19 (కరోనా వైరస్) వ్యాప్తిని అరికట్టేందుకు ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు రోడ్లపైకి రాకుండా ఇళ్లలోనే ఉన్నారు. జనతా కర్ఫ్యూకు పూర్తి మద్దతు తెలిపారు. అనంతపురం జిల్లాలోని గుంతకల్లు, గుత్తి, పామిడి పట్టణాల్లో హోటళ్లు, షాపులు, పెట్రోల్ బంకులు స్వచ్ఛందంగా మూసివేసి జనతా కర్ఫ్యూకు సంఘిభావం తెలిపారు.
అనంతలో హోటళ్లు, షాపులు బంద్
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు జనతా కర్ఫ్యూకు ప్రజలు మద్దతు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే గుంతకల్లు డివిజన్ పరిధిలోని 42 ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు. రాత్రి 10 గంటల తర్వాత రైళ్లు నడుపనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఎప్పుడూ రద్దీగా ఉండే గుంతకల్లు, గుత్తి రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులు లేక వెలవెలబోయాయి.