అనంతపురం జిల్లా కంబదూరు మండలం ఓబిగానిపల్లి సమీపంలో ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు స్థానిక రైతులతో కలిసి గంగ పూజ నిర్వహించారు. ఓబిగానిపల్లి చుట్టూ ఉన్న వాగులపై గతేడాది నుంచి కోట్లాది రూపాయలు వెచ్చించి ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ 7 చెక్ డ్యాములు నిర్మించింది. తొలకరి వర్షాలు భారీగా పడటంతో ఈ ఏడాది చెక్ డ్యాములు ఒకేసారి నిండిపోయాయి.
చెక్ డ్యాములు నిండాయని గంగ పూజ - ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ
అనంతపురం జిల్లా ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ నిర్మించిన చెక్ డ్యాములు... తొలకరి వర్షాలకే ఈ ఏడాది ఒకేసారి నిండిపోయాని ఆ సంస్థ ప్రతనిధులు తెలిపారు. రైతులతో కలిసి సంస్థ ప్రతినిధులు గంగపూజ నిర్వహించి హర్షం వ్యక్తం చేశారు.
7 చెక్డ్యాంలు నిండాయని గంగ పూజ...
ఆ సంస్థ ఎకాలజీ డైరెక్టర్ నాగేశ్వర్రెడ్డి, టెక్నికల్ డైరెక్టర్ విజయభాస్కర్ రెడ్డి, ఎకాలజీ సెక్టార్ టీం లీడర్ నరసింహులు, మోహన్ రెడ్డి పలువురు రైతులతో కలిసి చెక్ డ్యాములను పరిశీలించారు. రైతులతో కలిసి సంస్థ ప్రతినిధులు గంగపూజ నిర్వహించి తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ చెక్ డ్యాముల నిర్మాణంతో తమ గ్రామంలో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయని... ఆ సంస్థకు ఎంతో రుణపడి ఉంటామని రైతులు పేర్కొన్నారు.
ఇది చదవండిమైనర్పై గ్రామ వాలంటీర్ అత్యాచారయత్నం