కర్ణాటక నుంచి ఏపీకి అక్రమంగా మద్యం రవాణా అవుతోంది. అనంతపురం జిల్లా మడకశిర మండలంలోని సరిహద్దుల వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. కర్ణాటక నుంచి వస్తున్న ఓ లారీలో మద్యం పట్టుబడింది. డ్రైవర్ పారిపోయేందుకు యత్నించగా అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మద్యాన్ని, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మడకశిరలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్సై శేషగిరి తెలిపారు.
కర్ణాటక మద్యం పట్టివేత.. లారీ డ్రైవర్‌పై కేసు నమోదు - మడకశిర వార్తలు
అనంతపురం జిల్లా మడకశిరలో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో కర్ణాటక మద్యం పట్టుబడింది. తనిఖీలు చేపట్టిన ప్రతీ సారి మద్యం పట్టుబడుతోందని పోలీసులు తెలిపారు.
కర్ణాటక మద్యం పట్టివేత