ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఈటీవీ భారత్'కు స్పందన: వృద్ధురాలిని ఆదుకున్న స్వచ్ఛంద సంస్థ - ఈటీవీ భారత్ కథనానికి స్పందన

'రోడ్డే ఆవాసం..ఆకలితో సావాసం' అనే శీర్షికతో ఈటీవీ భారత్ ప్రచురించిన కథనానికి స్పందన లభించింది. అనంతపురంలోని బళ్ళారి బైపాస్ రోడ్డు డివైడర్ పై చిన్న తడకల నీడలో జీవనం సాగిస్తున్న వృద్ధురాలిని స్వచ్ఛంద సంస్థ నిర్వహకులు ఆదుకుని... వృద్ధాశ్రమానికి తరలించారు.

ETV bharat story
రోడ్డే ఆవాసం..ఆకలితో సావాసం

By

Published : Jun 4, 2020, 1:40 AM IST

అనంతపురంలోని బళ్ళారి బైపాస్ రోడ్డు డివైడర్ పై చిన్న తడకల నీడలో జీవనం సాగిస్తూ కష్టాలు పడుతున్న ఓ వృద్ధురాలి సమస్యను ఈనాడు, ఈటీవీ భారత్ వెలుగులోకి తీసుకువచ్చింది. కథనాన్ని ప్రచురించింది. స్పందించిన సహృదయ సేవాసమితి, సంజీవిని స్వచ్ఛంద సంస్థలు.. ఆమెకు అన్నం పెట్టి ఆకలి తీర్చారు.

సాయి సంస్థ ఆధ్వర్యంలో వృద్ధురాలిని అనంతపురం జిల్లా కూడేరు మండల పరిధిలోని గోటుకూరు గ్రామంలో ఆనంద నిలయం అనే వృద్ధాశ్రమానికి తరలించారు. ఆశ్రమంలో ఆమెకు కావలసిన అన్ని సౌకర్యాలను సమకూరుస్తామని సాయి సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఆమె దీనస్థితి తమకు తెలిసేలా చేసిన ఈనాడు, ఈటీవీ భారత్​కు కృతజ్ఞతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details