అనంతపురం జిల్లా లేపాక్షి మండల కేంద్రంలోని దుర్గా పాపనాశేశ్వర స్వామి ఆలయాన్ని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అరూప్ కుమార్ గోస్వామి సందర్శించారు. ప్రధాన న్యాయమూర్తితో పాటు హైకోర్టు న్యాయమూర్తులు గంగారావు, రఘునందన్ రావు, సురేష్ కుమార్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, ఉమాదేవి, వెంకటరమణలు కూడా ఆలయాన్ని దర్శించుకున్నారు.
న్యాయమూర్తుల బృందానికి అనంతపురం, హిందూపురం కోర్టు న్యాయమూర్తులు స్వాగతం పలికారు. ఆలయానికి విచ్చేసిన ప్రధాన అర్చకులు న్యాయమూర్తుల బృందానికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రధాన ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలోని శిల్పకళా సంపద గురించి అర్చకులను అడిగి తెలుసుకున్నారు. ఆలయం అంతటా తిరిగి.. ఆలయ విశిష్టత గురించి క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు.