ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైల్వే కొలువుల పేరిట ఘరానా మోసం… రూ.10 కోట్లు వసూలు

రైల్వే కొలువుల పేరిట అనంతపురం జిల్లాలోని గుంతకల్లులో ఘరానా మోసం చోటు చేసుకుంది. దాదాపు 50 మంది అభ్యర్థుల నుంచి రూ.10 కోట్ల వరకు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపించారు. ఈ మేరకు రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

By

Published : May 23, 2021, 3:36 PM IST

Updated : May 23, 2021, 5:29 PM IST

రైల్వే కొలువుల పేరిట ఘరానా మోసం… రూ.10 కోట్లు వసూలు
రైల్వే కొలువుల పేరిట ఘరానా మోసం… రూ.10 కోట్లు వసూలు

అనంతపురం జిల్లాలో రైల్వే ఉద్యోగాల పేరుతో మోసం చేసిన ఘటనలో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. ఈ మేరకు చెన్నైకి చెందిన 12 మంది బాధితులు రైల్వే పోలీసులను ఆశ్రయించారు. నకిలీ నియామక పత్రాలతో మోసగించారని బాధితులు ఫిర్యాదు చేశారు. 50 మంది నుంచి సుమారు రూ.10 కోట్లు వసూలు చేశారని ఆరోపించారు.

'ఇవి నకిలీ పత్రాలు'

నకిలీ ధ్రువపత్రాలతో గుంతకల్లు డీఆర్‌ఎం కార్యాలయానికి వెళ్లిన బాధితులు.. నియామక పత్రాలను అధికారులకు అందించారు. వాటిని పరిశీలించిన రైల్వే అధికారులు నకిలీ పత్రాలుగా గుర్తించారు. కేసును గుంతకల్లు ఒకటో పట్టణ పోలీసులకు బదలాయించారు. ఈ క్రమంలో నిందితుడు ఈనెల 18న కరోనాతో మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఇవీ చూడండి :రాజమహేంద్రవరం జైలు నుంచి 21 మంది ఖైదీలు విడుదల

Last Updated : May 23, 2021, 5:29 PM IST

ABOUT THE AUTHOR

...view details