అనంతపురం జిల్లా గుత్తి, పామిడి, పెద్దవడుగూరు మండలాల్లో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పెద్దవడుగూరు మండలంలోని పందుల వాగు ఉప్పొంగటంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. పెద్దవడుగూరు-మిడుతూరు మధ్య వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
వానొచ్చింది... వరద ముంచెత్తింది
అనంతపురం జిల్లాలోని కొన్ని మండలాల్లో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీనివల్ల లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కొన్నిచోట్ల వాగులు, వంకలు ఉప్పొంగి పారుతున్నాయి.
rain
అలాగే గుత్తి మండలం రజాపురం గ్రామంలో భారీ వర్షానికి ఓ ఇల్లు కూలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవటంతో ప్రమాదం తప్పింది. మరోవైపు గుత్తి, గుంతకల్, పామిడి, పెద్దవడుగూరు మండలాల్లో వాగులు, వంకలు ఉప్పొంగి పారుతున్నాయి. పలు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.