పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాయలసీమలోని అనంతపురం జిల్లాలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. గుత్తి, పెద్దవడుగురు మండలంలోని పలు గ్రామాల్లో పంట పొల్లాలోకి నీరు చేరాయి. పెద్దవడుగురు మండలంలోని కాసేపల్లి, రామరాజుపల్లితో పాటు పలు గ్రామాల్లో పత్తి, వేరుశెనగ పంటలు పూర్తిగా నీట మునగటంతో రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.
జోరుగా వర్షాలు.. నీట మునిగిన పంటలు - అనంతపురం జిల్లాలో వర్షాలు
అనంతపురం జిల్లా పెద్దవడుగురు మండలంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. జోరు వానలతో వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. పోలాల్లోకి నీరు చేరి పంటలు నీట మునిగాయి.
ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులు
తెలికి-మిడుతూరు గ్రామాల మధ్య గల పందుల వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఆర్టీసీ బస్సు సాంకేతిక లోపంతో వాగు మధ్యలో ఆగిపోయింది. చుట్టుపక్కల స్థానికులు వెంటనే ట్రాక్టర్ సహాయంతో బస్సును ఒడ్డుకి చేర్చటంతో పెను ప్రమాదం తప్పింది. ఇదేదారిలో వాగును దాటడానికి ప్రయత్నిoచిన ఒక ద్విచక్ర వాహనం కొట్టుకుపోయింది. వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో పొలాల్లోకి నీరు చేరి నీట మునిగాయి.
ఇదీ చదవండి: ఏడాది అప్పు ఐదు నెలల్లోనే!