అనంతపురం జిల్లా రోళ్శ మండలం టీడీపల్లి గ్రామంలో రైతు చెల్లూరప్ప తన పొలంలో పండించిన 50 బస్తాల వేరుశనగను పొలంలోనే రాశిగా పోసి రాత్రి అక్కడ గుడిసెలోనే నిద్రించాడు. భారీ వర్షానికి పక్కనే ఉన్న వంక పొంగి పొలంలోకి ఒక్కసారిగా నీరు ప్రవాహం రావడంతో నిద్రిస్తున్న రైతు అక్కడికక్కడే మృతి చెందాడు.
అనంతలో భారీ వర్షం.. రైతు మృతి.. దెబ్బతిన్న పంటపొలాలు - అనంతపురంలో భారీ వర్షం
అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు వంకలు, వాగులు, చెక్‌డ్యామ్‌లు పొంగిపొర్లాయి. వేరుశనగ పంటకు అధికంగా నష్టం వాటిల్లింది. ఒక్కసారిగా వంక పొంగి పొలంలోకి రావడం వల్ల అక్కడే నిద్రిస్తున్న రైతు మృతి చెందాడు.
పొలంలోని వేరుశనగ.. నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఉదయం విషయాన్ని గమనించిన చుట్టుపక్కల రైతులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు వివరాలు తెలుసుకున్నారు. నీలకంఠాపురం గ్రామంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి రైతుల పొలాల్లోకి వెళ్లి దెబ్బతిన్న వేరుశనగ పంటను, కాలువలో, బావుల్లో నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
ఇదీ చదవండి :నిండు చూలాలును మంచంపై మోస్తూ.. 5 కి.మీ కాలినడకన..