తమకు సంబంధించిన భూముల్లో నష్ట పరిహారం చెల్లించాకే తవ్వకాల పనులు మొదలు పెట్టాలంటూ అనంతపురం జిల్లా గుత్తి మండలం అనగానాదొడ్డి గ్రామ రైతులు నిరసన చేపట్టారు. తమకి నష్ట పరిహారం చెల్లించకుండా ఎలా పనులు మొదలు పెడుతరంటూ హెచ్.పి.సి.ఎల్ అధికారులను నిలదీశారు. తమకు నోటీసులు గడువు దాటాక అందించి పనులు ఎలా మొదలు పెడతారని అన్నారు. పంటలు పండుతున్న కాలంలో ఎలా పనులు మొదలు పెడతారని కంపెనీ నిర్వాహకులను అడ్డుకున్నారు.
పరిహారం చెల్లించకుండా తవ్వకాలు ఎలా చేపడతారు?
నష్ట పరిహారం చెల్లించకుండా తమ భూముల్లో తవ్వకాలు ఎలా చేస్తారని అనంతపురం జిల్లా గుత్తి మండలం అనగానాదొడ్డి గ్రామ రైతులు అధికారులను ప్రశ్నించారు. పంటలు పండుతున్న కాలంలో ఎలా పనులు మొదలు పెడతారని కంపెనీ నిర్వాహకులను అడ్డుకున్నారు. అధికారులు తమకు న్యాయం చేయాలని కోరారు.
అధికారులను ప్రశ్నిస్తున్న రైతులు
ఈ విషయం గురించి జిల్లా, అధికారులకు డిప్యూటీ కలెక్టర్ కు ఎన్ని సార్లు విన్నవించినా తమ గోడును అధికారులు పట్టించు కోలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు తమ గ్రామాన్ని సందర్శించి జనాభిప్రాయ సేకరణ నిర్వహించాలని కోరారు. గ్రామ ప్రజల అధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసి తమకు ఉన్న సందేహాలను తొలగించాలన్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని గ్రామ రైతులు వేడుకున్నారు.
ఇదీ చదవండి: అంతర్వేది ఆలయ ఈవోను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు